A.R. మురుగదాస్ దృష్టిలో స్పైడర్

Wednesday,September 27,2017 - 09:02 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు, A.R. మురుగదాస్ సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో తనకు పర్సనల్ గా అద్భుతమనిపించిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు A.R. మురుగదాస్.

అవుట్ స్టాండింగ్ సెకండాఫ్ : అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కిన స్పైడర్ లో సెకండాఫ్ ఎక్స్ట్రా ఆర్దినరీగా నిలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఏ చిన్న పాయింట్ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో చివర్లో షూట్ చేశాం. స్పైడర్ లో క్లైమాక్స్ మెయిన్ బ్లోయింగ్ గా ఉంటుంది.

యాక్షన్ సీక్వెన్సెస్ : సినిమాలో ఒక సిచ్యువేషన్ లో ఏకంగా 2000 మందితో జరిగే యాక్షన్ సీక్వెన్సెస్ జూనియర్ ఆర్టిస్టులతో ఉండే రాక్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో వచ్చే రోలర్ కోస్టర్ ఫైట్స్ థియేటర్ లో సినిమా చూస్తున్న ప్రతి ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయడం ఖాయం.

విలన్ ఐడియాలజీ : రేర్ ఆనిమల్ ని కాపాడాలి. కుప్పలు కుప్పలుగా ఉన్న జీవినైనా చంపవచ్చు అనే విలన్ ఐడియాలజీ కొత్తగా అనిపిస్తుంది. మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న విలన్, డిజాస్టర్స్ క్రియేట్ చేసే విధానం, ఆ ప్రాసెసింగ్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి.

స్పైడర్ థీమ్ : జనరల్ గా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే జనాలు అవతల విక్టిమ్స్ ని కాపాడటం మానేసి, వీడియోస్ తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటిది ఒక పెద్ద డిజాస్టర్ జరిగితే ఏం చేస్తారు..? అప్పటికీ వీడియోస్ తీస్తారా…? మారతారా.? మార్పు రావాలంటే నిజంగా అలాంటి డిజాస్టర్స్ వచ్చే వరకు ఆగాలా..? అనేదే స్పైడర్ థీమ్.