2 మిలియన్స్ వ్యూస్ కి దగ్గరలో స్పైడర్ ‘హాలి హాలి’

Wednesday,September 06,2017 - 03:45 by Z_CLU

స్పైడర్ సెకండ్ సింగిల్ ‘హాలి హాలి’ యూ ట్యూబ్ లో గంట గంటకి వ్యూస్ ని పెంచుకునే పనిలో పడింది. అప్పుడే 2 మిలియన్స్ వ్యూస్ కి దగ్గరలో ఉన్న ఈ సాంగ్ యూత్ ని ఎట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయింది.  ట్రెడిషనల్ టచ్ తో సాగే ఈ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లోను గ్రాండ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. S J సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాని ఠాగూర్ మధు, NV ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.