హిట్ టాక్ సొంతం చేసుకున్న 'స్పైడర్'

Wednesday,September 27,2017 - 10:01 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కిన ‘స్పైడర్’ తెలుగు, తమిళ, మలయాళ, అరబ్బీ భాషల్లో ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఇప్పటికే సినిమాకు హిట్ టాక్ వచ్చేసింది. మహేష్ క్యారెక్టర్, మురుగదాస్ ఇంటలిజెన్స్ స్క్రీన్ ప్లే, యాక్షన్ పార్ట్, సెకండ్ హాఫ్ లో వచ్చే ఆసక్తికరమైన ఎపిసోడ్, క్లైమాక్స్ సినిమాకు హైలైట్స్ అని తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన స్పైడర్ ఎర్లీ మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.  ఆంధ్రప్రదేశ్, నైజాం ఏరియాల్లో స్పైడర్ కు భారీగా థియేటర్లు దక్కాయి. 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమాను కేవలం మహేష్ బాబు మాత్రమే చేయగలడని అంటున్నారు ఫ్యాన్స్. పక్కా థ్రిల్లర్ జానర్ తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్స్ గా నిలిచిపోతుందని అంటున్నారు.