స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ వాయిదా

Wednesday,May 31,2017 - 12:02 by Z_CLU

లెక్కప్రకారం ఈరోజు స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకావాలి. సాయంత్రం 5 గంటలకు టీజర్ ను లాంచ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దర్శకరత్న, టాలీవుడ్ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు అకాల మరణంతో స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలను వాయిదా వేశారు. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

మహేష్ బాబును వెండితెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు. దాసరి డైరక్ట్ చేసిన నీడ చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు మహేష్ బాబు. అలాంటి గొప్ప వ్యక్తి మృతికి సంతాప సూచకంగా స్పైడర్ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలను వాయిదా వేశారు.

స్పైడర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ నడుస్తోంది. 2 పాటలు, కొంత యాక్షన్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. జూన్ 15 లోపు ఇవన్నీ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ నెలాఖరుకు స్పైడర్ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.