రేపట్నుంచే ఆఖరి షెడ్యూల్

Friday,May 12,2017 - 11:06 by Z_CLU

స్పైడర్ సినిమా ఓ కొలిక్కి వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ రేపట్నుంచి ప్రారంభం కానుంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తికాగా… చిన్నచిన్న సీన్లు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం గోవా టూర్ లో ఉన్న మహేష్ రేపట్నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో పాల్గొంటారు.

మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది స్పైడర్ సినిమా. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యమౌతోంది.

షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్స్ క్లూజివ్ గా 2 నెలల టైం తీసుకోబోతున్నారు. క్వాలిటీతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడా రాజీపడకుండా మూవీని తీసుకొస్తున్నారు. NVR బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తుండగా.. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.