1.5 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైన స్పైడర్

Wednesday,October 04,2017 - 10:41 by Z_CLU

మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమా ఓవర్సీస్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. విడుదలైన 3 రోజులకే మిలియన్ క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా.. తాజాగా 1.5 మిలియన్ క్లబ్ లోకి జాయిన్ అయింది. అమెరికాలో మంగళవారం నాటికి 163 లొకేషన్ల నుంచి వచ్చిన వసూళ్ల ఆధారంగా లెక్కిస్తే… స్పైడర్ మూవీ 1.5 మిలియన్ డాలర్ టచ్ చేసింది. పూర్తి వివరాలు వస్తే.. ఈ ఫిగర్ ఇంకాస్త ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.

మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ పై ఓవర్సీస్ లో మొదట్నుంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్టయిలిష్ గా, అదిరిపోయే స్టోరీలైన్ తో తెరకెక్కింది స్పైడర్ మూవీ. అలా డే-1 నుంచి పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన స్పైడర్ సినిమా.. ఇప్పుడు 1.5 మిలియన్ క్లబ్ లోకి ఎంటరైంది.

స్పైడర్ కు ఓవర్సీస్ లో వసూళ్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. ఈ అప్ కమింగ్ వీకెండ్ బాక్సాఫీస్ బరిలో బడా సినిమాలేవీ రిలీజ్ కావడంలేదు. సో.. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి స్పైడర్ వసూళ్లు మరింత పెరుగుతాయి.