1 మిలియన్ క్రాస్ చేసిన స్పైడర్

Thursday,September 28,2017 - 10:51 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన స్పైడర్ సినిమా రిలీజైన అన్ని ఏరియాస్ నుంచి ట్రెంమండస్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్ వసూళ్లను తెచ్చిపెట్టారు.

ఓవర్సీస్ లో 3వందలకు పైగా థియేటర్లలో స్పైడర్ ప్రీమియర్స్ పడ్డాయి. వీటిలో ఇప్పటివరకు 230 థియేటర్ల కలెక్షన్లు రాగా.. ఆ లెక్క 10లక్షల డాలర్లు దాటింది. మిగతా థియేటర్ల కలెక్షన్ కూడా కలుపుకుంటే దాదాపు 1.5 మిలియన్ డాలర్లకు దగ్గర్లో వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

మురుగదాస్-మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. మహేష్ యాక్టింగ్, మురుగదాస్ టేకింగ్, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ, హరీష్ జైరాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.