షూటింగ్ కంప్లీట్ చేసుకున్న స్పైడర్

Thursday,August 31,2017 - 07:03 by Z_CLU

మహేష్ బాబు ‘స్పైడర్’ సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది. రొమేనియాలో గతవారం రోజులుగా సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, ఈ రోజు గుమ్మడి కాయ కొట్టేసింది. రేపు స్పైడర్ టీమ్ ఇండియాకు బయలుదేరనుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాతో మహేష్ బాబును కోలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, సెప్టెంబర్ 9 న గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అటెండ్ కాబోతున్నాడనే న్యూస్, కోలీవుడ్ తో పాటు, టాలీవుడ్ లోను వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా బిగిన్ చేసేసింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ కి రెడీ అవుతుంది.