సెన్సార్ క్లియరెన్స్ పొందిన స్పైడర్

Monday,September 18,2017 - 02:48 by Z_CLU

మహేష్ బాబు నటించిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ సెన్సార్ క్లియరైంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 25 నిమిషాల రన్  టైమ్  ఫిక్స్ చేసుకున్న  స్పైడర్ సినిమాకు సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ సూచించలేదు. చివరికి స్పైడర్ సినిమాలో “నో స్మోకింగ్, నో డ్రింకింగ్” లాంటి సైన్ బోర్డులు వేసే అవసరం కూడా లేదు.

ఈ మధ్య కాలంలో ఇలా ఒక్క కట్, మ్యూట్ లేకుండా సెన్సార్ పూర్తిచేసుకున్న సినిమా స్పైడర్ మాత్రమే. కాకపోతే ఇందులో ఉన్న యాక్షన్ కంటెంట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

 

సెన్సార్ కంప్లీట్ అవ్వడంతో సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఈనెల 27న స్పైడర్ సినిమాను వరల్డ్ వైడ్ విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, అరబ్బీ భాషల్లో స్పైడర్ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. ఏఆర్ మురుగదాస్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు కలిసి నిర్మించారు.