రెండు రోజుల్లో స్పైడర్ బూమ్

Monday,July 31,2017 - 12:21 by Z_CLU

మహేష్ బాబు ‘స్పైడర్’ సీజన్ బిగిన్ అయింది. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న స్పైడర్ ఫస్ట్ సింగిల్ ‘బూమ్ బూమ్’ కి కౌంట్ డౌన్ బిగిన్ అయింది. సెప్టెంబర్ 27 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా చిన్నగా హైప్ ని పెంచుకునే పనిలో పడింది. మే నెలలో అల్టిమేట్ స్టైలిష్ టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన స్పైడర్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కి గంటలు గడిచిన కొద్దీ డిమాండ్ పెరిగిపోతుంది.

A.R. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ లో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. హారిస్ జయరాజ్ మ్యూజిక్ డైరెక్టర్.  ఠాగూర్ మధు, NV ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.