స్పైడర్ 'బూమ్ బూమ్' సింగిల్ రిలీజ్

Wednesday,August 02,2017 - 07:24 by Z_CLU

మహేష్ బాబు  స్పైడర్ హంగామా బిగిన్ అయింది. ముందుగా అనౌన్స్ చేసినట్టు’బూమ్ బూమ్’ అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సాంగ్ కి సంబంధించి అప్ డేట్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీగా ట్రెండింగ్ అవుతోంది స్పైడర్. ఈరోజు రిలీజ్ అయిన ‘బూమ్ బూమ్’ సాంగ్ తో స్పైడర్ ఆడియో రిలీజ్ ప్రాసెస్ మొదలైంది.

హారిస్ జయరాజ్ కంపోజిషన్ లో ట్యూన్ అయిన ఈ సాంగ్ ఆల్ రెడీ క్రియేట్ అయి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. నికితా గాంధీ పాడిన ఈ పాట సినిమాలో థీమ్ సాంగ్ ను తలపిస్తోంది.  మహేష్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా, మురుగదాస్ టేకింగ్ ను మరింత స్టయిలిష్ గా చూపించేలా ట్రెండీగా ఉంది సాంగ్.

ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్  లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎన్వీఆర్ బ్యానర్ పై తెరకెక్కుతున్న స్పైడర్ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.