మిలియన్ వ్యూస్ దాటిన స్పైడర్ ‘బూమ్ బూమ్’

Thursday,August 03,2017 - 11:39 by Z_CLU

నిన్న సాయంత్రం రిలీజైన స్పైడర్ ‘బూమ్ బూమ్’ సింగిల్  తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్పైడర్ బూమ్ పెరిగిపోయింది. అల్టిమేట్ స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయిన ఉందో ఈ సింగిల్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తెలిసిపోతుంది. రిలీజైన కొన్ని గంటల్లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది ‘బూమ్ బూమ్ సింగిల్.

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్, స్టామినా ఎలివేట్ అయ్యేలా కంపోజ్ అయిన ఈ సింగిల్ తో పాటు, సినిమా యూనిట్ కొన్ని ఇంటరెస్టింగ్ మేకింగ్ షాట్స్ ని కూడా ఆడ్ చేయడం, బూమ్ బూమ్ కి మరింత ఎట్రాక్షన్ లా మారింది. హారిస్ జయరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  ఈ సినిమా మహేష్ బాబు కరియర్ లో మరో ట్రెండ్ సెట్టర్ అనిపించుకోవడం గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సెప్టెంబర్ 27 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా NVR బ్యానర్ పై తెరకెక్కుతుంది.