గ్రాండ్ గా స్పైడర్ ఆడియో రిలీజ్

Sunday,September 10,2017 - 09:32 by Z_CLU

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పైడర్ సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరుకాగా.. అనుకోని కారణాల వల్ల రాలేకపోయిన రజనీకాంత్.. తన శుభాకాంక్షల్ని తెలియజేశారు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన స్పైడర్ పాటల్ని మహేష్, మురుగదాస్, రకుల్ సంయుక్తంగా విడుదల చేశారు.


మహేష్ మాట్లాడుతూ.. “మురుగదాస్‌తో పనిచేయడం నిజంగా గర్వంగా భావిస్తున్నా. ‘స్పైడర్‌’ రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రం. అందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రతీ ప్రేక్షకుడిని థ్రిల్‌కు గురిచేస్తుంది. కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. ఇందులో నేను పోషించిన పాత్ర నా మనసుకు చాలా దగ్గరైంది.” అన్నారు.


15వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో జరగనున్న ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నారు. దసరా కానుకగా ఈనెల 27న స్పైడర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.