మరికొన్ని గంటల్లో స్పైడర్ ఆడియో రిలీజ్

Saturday,September 09,2017 - 10:38 by Z_CLU

మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ పై అందరి చూపు ఉంది. ఈరోజు ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓ భారీ ఈవెంట్ లో స్పైడర్ తెలుగు-తమిళ ఆడియో సాంగ్స్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.

చెన్నైలోని కలైవానర్ ఆరంగం ఆడిటోరియంలో స్పైడర్ ఆడియో రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తిచేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.

ఇక సాంగ్స్ విషయానికొస్తే బూమ్..బూమ్, హాలీ హాలీ అనే లిరిక్స్ తో సాగే 2 పాటల్ని ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్. ఈ రెండు పాటలతో పాటు మిగిలిన 3 పాటల్ని ఈరోజు సాయంత్రం గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. హరీష్ జైరాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.