ఎల్లుండి స్పైడర్ ఆడియో రిలీజ్

Thursday,September 07,2017 - 12:24 by Z_CLU

ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇక మిగిలిన పాటల్ని నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అవును.. మహేష్-మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ జూక్ బాక్స్ ఎల్లుండి (సెప్టెంబర్ 9) నుంచి యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది.

చెన్నైలో సెప్టెంబర్ 9న స్పైడర్ సినిమాకు సంబంధించి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి దర్శకులు శంకర్, రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ఆ వేదికపై తెలుగు, తమిళ భాషల్లో స్పైడర్ సాంగ్స్ ను విడుదల చేయబోతున్నారు.

మరోవైపు స్పైడర్ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దసరా కానుకగా ఈనెల 27న స్పైడర్ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, అరబ్బీ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.