8 లక్షల వ్యూస్ క్రాస్ చేసిన ఆడియో జ్యూక్ బాక్స్

Monday,September 11,2017 - 02:36 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ ఆడియో సూపర్ హిట్టయింది. ఇప్పటికే 8 లక్షల వ్యూస్ ని క్రాస్ చేసిన జ్యూక్ బాక్స్ గంట గంటకి వ్యూస్ పెంచుకుంటూనే ఉంది.  అల్టిమేట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 9 న గ్రాండ్ గా చెన్నై లో లాంచ్ అయింది. హారిస్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ ఆల్ రెడీ క్రియేట్ అయిన స్పైడర్ మానియా డోస్ పెంచేస్తుంది.

 

A.R మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజవుతుంది. ఆల్ మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న స్పైడర్, హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. N.V. ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.