మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన స్పైడర్ జ్యూక్ బాక్స్

Thursday,September 14,2017 - 03:03 by Z_CLU

హరీజ్ జైరాజ్ మ్యూజిక్ ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. స్పైడర్ పాటలు కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ సినిమాకు హరీష్ ఇచ్చిన ట్యూన్స్ సూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో ఈ మూవీ జ్యూక్ బాక్స్ అప్పుడే 10 లక్షల వ్యూస్ క్రాస్ చేసింది.

స్పైడర్ కు మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్ అవుతుంది. మొత్తం 5 సాంగ్స్ ఉంటే, అందులో ఒకటి థీమ్ సాంగ్. అంటే సినిమాలో ఉన్న పాటలు నాలుగే. వీటిలో ‘బూమ్ బూమ్’ అనే సాంగ్ హీరో ఇంట్రడక్షన్ లో వచ్చే పాట. ఇక ‘హాలీ హాలీ’, ‘సిసిలియా’ అనే లిరిక్స్ తో సాగే మరో 2 పాటలు డ్యూయట్స్. వీటితో పాటు అచ్చం తెలుగందం అనే మరో పాట కూడా శ్రోతల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.