'స్పైడర్' పై భారీ అంచనాలు

Sunday,July 16,2017 - 12:01 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు -మురుగదాస్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మోస్ట్ ఎవటింగ్ మూవీ ‘స్పైడర్’ ప్రెజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా ప్రెజెంట్ విజువల్ ఎఫెక్ట్స్ వార్తతో హల్చల్ చేస్తూ ఆడియన్స్ మరింతగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రష్యా,ఇరాన్, బ్రిటన్ దేశాలతో పాటు మరో మూడు దేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోందని ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి..

ఈ సినిమా విజువల్ వండర్ గా ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుందని, ఇప్పటి వరకూ మహేష్ సినిమాలో చూడని సరికొత్త ఎలెమెంట్స్ తో స్పైడర్ ఎంటర్టైన్ చేస్తుందని లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో మురుగదాస్ కూడా చెప్పడంతో ఈ సినిమా కోసం అటు మహేష్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో టీజర్ ను ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసి సెప్టెంబర్ 27 న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.