ఆల్ టైం ప్రీమియర్స్ లో నాలుగో స్థానం

Thursday,September 28,2017 - 11:03 by Z_CLU

ఓవర్సీస్ ఆల్ టైం ప్రీమియర్స్ లో నాలుగో స్థానంలో నిలిచింది స్పైడర్ సినిమా. మహేష్-మురుగదాస్ గ్రేట్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రీమియర్స్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. అలా విడుదలకు ముందే మిలియన్ డాలర్ కు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది స్పైడర్. 3వందలకు పైగా లొకేషన్లలో విడుదలైన స్పైడర్ మువీ 236 లొకేషన్ల వసూళ్లతోనే 10లక్షల డాలర్లు ఆర్జించింది.

ఇక యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా టాప్ పొజిషన్ లో నిలిచిన మూవీస్ లో మొదటి రెండు స్థానాల్లో బాాహుబలి-2, బాహుబలి-1 సినిమాలున్నాయి. మూడో స్థానంలో ఖైదీ నంబర్ 150 నిలవగా.. నాలుగోస్థానంలో స్పైడర్ నిలిచింది.

డొమస్టిక్ గా చూస్తే స్పైడర్ సినిమా కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. ఏపీ, నైజాంతో పాటు కేరళ, తమిళనాడు, ముంబయి నుంచి స్పైడర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అటు అరబ్బీ భాషలో విడుదలైన ఈ సినిమాకు మిడిల్-ఈస్ట్ కంట్రీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.