తెలుగు రాష్ట్రాల్లో స్పైడర్ మొదటి రోజు వసూళ్లు

Thursday,September 28,2017 - 11:12 by Z_CLU

భారీ అంచనాల మధ్య విడుదలైన స్పైడర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కళ్లుచెదిరే వసూళ్లు రాబట్టింది. మహేష్-మురుగదాస్ క్రేజీ కాంబినేషన్ లో 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ థ్రిల్లింగ్ ఎడ్వంచరస్ మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల 33 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. నైజాంలో దాదాపు 3వందల స్క్రీన్స్ పై విడుదలైన స్పైడర్ సినిమా దాదాపు 4 కోట్ల 10లక్షల రూపాయల షేర్ సాధించడం విశేషం.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్లు (షేర్)

నైజాం – 4.10 కోట్లు
సీడెడ్ – 3.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.40 కోట్లు
ఈస్ట్ – 2.20 కోట్లు
వెస్ట్ – 1.35 కోట్లు
గుంటూరు – 2.40 కోట్లు
కృష్ణా – 1.35
నెల్లూరు – 1.03 కోట్లు

మొత్తం షేర్ – 17.33 కోట్లు