మరికొన్ని గంటల్లో స్పైడర్ సెకెండ్ సింగిల్ రిలీజ్

Monday,September 04,2017 - 11:24 by Z_CLU

మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ స్పైడర్ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ కాబోతోంది. ఈరోజు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయబోతున్నారు. హాలీ హాలీ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు.

స్పైడర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సింగిల్ రిలీజైంది. బూమ్ బూమ్ అనే లిరిక్స్ తో సాగే ఆ సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. విడుదలైన కొన్ని గంటలకే లక్షల్లో హిట్స్ వచ్చాయి. ఇనిస్టెంట్ గా హిట్ అయింది ఆ పాట. అదే ఊపులో ఇప్పుడు సెకెండ్ సాంగ్ కూడా రాబోతోంది.

స్పైడర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. రొమేనియాలో తీసిన రొమాంటిక్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఎన్వీఆర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్వీ ప్రసాద్ నిర్మాత. ఠాగూర్ మధు ఈ సినిమాను సమర్పిస్తున్నారు.