ఈ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్నట్టే...
Saturday,September 28,2019 - 10:02 by Z_CLU
యాక్షన్ తక్కువ.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ… సినిమాలో గ్లామర్ డోస్ తగ్గినా… మరీ దుమ్ము దులిపేసే స్థాయి హీరోయిజం లేకపోయినా కంటెంట్ కాస్తంత కదలకుండా కూర్చోబెట్టగలిగితే చాలు ప్రొడ్యూసర్స్ కి రిటర్న్స్ గ్యారంటీ… హీరోల పాకెట్ లో హిట్టు గ్యారంటీ. సక్సెస్ గ్యారంటీ అనిపించుకుంటున్న ‘స్పై థ్రిల్లర్స్’ వరసలో ఇప్పుడు గోపీచంద్ ‘చాణక్య’ కూడా చేరింది.

చాణక్య : సినిమా రిలీజ్ కి ముందే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఈసారి గోపీచంద్ గట్టిగా కొట్టేలా ఉన్నాడు… అనిపించేంతలా మెస్మరైజ్ చేస్తుంది. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టులు… ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా తెరకెక్కిన ‘చాణక్య’ సక్సెస్ అయ్యే చాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి.

గూఢచారి : అడివి శేష్ పెన్నుకి.. పర్ఫామెన్స్ కి ఉన్న దమ్మును ఎలివేట్ చేసిన సినిమా. మాస్ మసాల సినిమాల మధ్య కూల్ బ్రీజ్ లా రిలీజైన ‘గూఢచారి’ ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే.. ఇండస్ట్రీలోని మిగతా ఫిల్మ్ మేకర్స్ కి కూడా ఇలాంటి ‘స్పై థ్రిల్లర్స్ తెరకెక్కించాలనే ఆలోచన కలిగించింది.

PSV గరుడవేగ: ఆంగ్రీస్టార్ రాజశేఖర్ ని మళ్ళీ ట్రాక్ పైకి తీసుకొచ్చిన సినిమా. ఈ సినిమాలో రాజశేఖర్ NIA ఆఫీసర్ గా నటించాడు. స్పై థ్రిల్లర్స్ సీజన్ ని క్రియేట్ చేసిందీ సినిమా.

విశ్వరూపం : ఇండియన్ సినిమా హిస్టరీ లోనే స్పెషల్ సిరీస్. కమలహాసన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్స్ డెఫ్ఫినెట్ గా సమ్ థింగ్ స్పెషలే. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ఈ సిరీస్ రెగ్యులర్ సినిమాల వరసలో స్పెషల్ గా నిలిచింది.