October Releases - హంగామా మొదలైంది

Monday,September 27,2021 - 01:42 by Z_CLU

వచ్చే నెల నుండి టాలీవుడ్ లో వరుస సినిమాలతో హంగామా మొదలు కానుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరి’ థియేటర్స్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారం అక్టోబర్ 1న సాయి తేజ్ ‘రిపబ్లిక్’ థియేటర్స్ లోకి రానుంది. ఆ తర్వాత రోజుల్లో అఖిల్ – పూజ హెగ్డే నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వైష్ణవ్ తేజ్- రకుల్ కాంబోలో వస్తున్న ‘కొండ పొలం’ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ఇక దసరా కానుకగా ఇప్పటికే శర్వానంద్, సిద్దార్థ్ ‘మహా సముద్రం’ ప్రకటించేసి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశారు. అక్టోబర్ 14న మహాసముద్రం రిలీజ్ అవ్వబోతుంది. ఆ నెక్స్ట్ డే అంటే 15న దసరా స్పెషల్ గా నాగ శౌర్య ‘ వరుడు కావలెను’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే రోజున అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతోంది.

ఇక అదే నెలలో ‘పెళ్లి సందD’ కూడా రానుంది. ఆ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అవ్వలేదు. మరి పెళ్లి సందడి కూడా దసరా సీజన్ లోనే వస్తుందా ? లేదా నెలాఖరున ఏమైనా వస్తుందా ? తెలియాలి.

ఇలా అక్టోబర్ లో యంగ్ హీరోల నుండి వారానికి రెండు చెప్పున అరడజను సినిమాలు రానున్నాయి. అవి కూడా జస్ట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రమే. సెకండాఫ్ అంటే అక్టోబర్ 15 నుండి నెలాఖరు వరకు ఇంకా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటి డీటెయిల్స్ కూడా త్వరలోనే తెలియనున్నాయి.

సో వచ్చే నెల అక్టోబర్ 1 నుండి వరుస సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని సూపర్ హిట్స్ అనుకుంటాయో మళ్ళీ టాలీవుడ్ లో ఎలాంటి హంగామా మొదలవుతుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics