అరవింద సమేత.. సర్ ప్రైజ్ గిఫ్ట్

Saturday,September 15,2018 - 10:00 by Z_CLU

20న ఆడియో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అంతకంటే ముందే పాటల హంగామా షురూ చేసింది అరవింద సమేత యూనిట్. అవును.. ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ ను ఈరోజు విడుదల చేయబోతున్నారు. దీన్నొక స్పెషల్ లిరికల్ వీడియోగా చెబుతోంది యూనిట్. సరిగ్గా సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ పాట ప్రత్యక్షం కాబోతోంది.

అనగనగనగా అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను తమన్ కంపోజ్ చేశాడు. త్రివిక్రమ్-తమన్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. అందుకే పాటలపై అంత క్యూరియాసిటీ.

ఇక ఈ ఎనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ మరో ఎట్రాక్షన్. ఇప్పటికే ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనికితోడు తాజాగా విడుదల చేసిన మరో కూల్ ఫొటో సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది.