‘శైలజారెడ్డి అల్లుడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్

Wednesday,September 05,2018 - 05:42 by Z_CLU

ఈ నెల 13 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా. అయితే ఇప్పటికే సాంగ్స్ తో, ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ నెల 9 న  కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు. అయితే ఈ ఈవెంట్ కి దేవదాస్, అదే నాగార్జున, నాని చీఫ్ గెస్ట్ గా రానున్నారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ ఇప్పటికే కావాల్సినంత బజ్ క్రియేట్ ఉంది. దానికి తోడు ఈ ఈవెంట్ కి నాగార్జున, నాని అటెండ్ అవుతున్నారనగానే సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ చుట్టూ ఇంట్రెస్టింగ్  డిస్క ర్షన్స్ జరుగుతున్నాయి.

ఈ ఈవెంట్ లో నాగార్జున, నాని స్పీచ్ ఎలా ఉండబోతుందోనన్న సస్పెన్స్ ఓ వైపు, శైలజా రెడ్డి టీమ్ ఈ సినిమా గురించి ఈవెంట్ లో చెప్పబోయే ఇంట్రెస్టింగ్ కబుర్ల చుట్టూ ఫ్యాన్స్ లో బోలెడంత క్యూరియాసిటీ కనిపిస్తుంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ కి అల్లుడిలా కనిపించనున్నాడు నాగ చైతన్య. అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చైతు, కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. నాగవంశీ ప్రొడ్యూసర్.