ఎన్టీఆర్ బయోపిక్ పై స్పెషల్ ఎనౌన్స్ మెంట్

Friday,May 25,2018 - 05:00 by Z_CLU

తేజ తప్పుకున్న తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ పై రోజుకో గాసిప్ పుట్టుకొచ్చింది. రోజుకో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వబోతోంది యూనిట్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, మే 28న ఈ సినిమాకు సంబంధించి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి.

ఎన్టీఆర్ ప్రాజెక్టును క్రిష్ కు అప్పగించారు. ఈ బయోపిక్ ను హ్యాండిల్ చేయడానికి క్రిష్ కూడా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్నే సోమవారం అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు హీరోయిన్, టెక్నికల్ టీమ్ కు సంబంధించి వివరాల్ని కూడా మరోసారి అధికారికంగా వెల్లడిస్తారు.

 ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిన ఈ సినిమాను జులై నుంచి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలయ్య-క్రిష్ కాంబోలో వస్తున్న మరో గ్రాండియర్ మూవీ ఎన్టీఆర్.