పెళ్లి చేసుకున్న సోనమ్ కపూర్

Tuesday,May 08,2018 - 05:01 by Z_CLU

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి చేసుకుంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజా, సోనమ్ కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నారు. పైనల్ గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, ఈరోజు ఉదయం 11 గంటల 30నిమిషాల ప్రాంతాల్లో ముంబయిలోని సోనమ్ కపూర్ బంధువుల ఇంట్లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఈ పెళ్లికి కేవలం బంధువులు, బాలీవుడ్ లో సోనమ్ కు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహానికి హాజరైన వాళ్లలో సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అమీర్ ఖాన్, రాణిముఖర్జీ, బోనీకపూర్ ఉన్నారు. ఈరోజు సాయంత్రం బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులకు ముంబయిలో గ్రాండ్ రిసెప్షన్ పార్టీ ఏర్పాటుచేశాడు సోనమ్ తండ్రి అనీల్ కపూర్.

సోనమ్-ఆనంద్ ల పెళ్లి 3 రోజుల పాటు సాగింది. మొన్న ముంబయిలోని లీల హోటల్ లో జరిగిన మెహందీ ఫంక్షన్ తో ఈ వేడుక ప్రారంభమైంది. రాత్రి సంగీత్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈరోజు ఉదయం సోనమ్-ఆనంద్ పెళ్లితో ఒకటయ్యారు. కేన్స్ సిటీలో హనీమూన్ ప్లాన్ చేసుకుంది ఈ జంట. ఈ నగరం అంటే సోనమ్ కు చాలా ఇష్టం. ప్రతి ఏటా జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు ఆమె ఎటెండ్ అవుతుంది.