'మహర్షి' లో మరో హీరోయిన్

Sunday,November 18,2018 - 03:09 by Z_CLU

మహేష్ బాబు -వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మహర్షి’లో మహేష్ సరసన మరో హీరోయిన్ స్క్రీన్ షేర్ చేసుకోనుందట.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుందట.. ఇటివలే ఈ రోల్ కోసం మెహ్రీన్ ని సంప్రదించిన మేకర్స్ ఫైనల్ గా సోనాల్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే యూనిట్ సోనాల్ పార్ట్ షూట్ కూడా ఫినిష్ చేసినట్లు తెలుస్తుంది. మరి సోనాల్ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తుందో..చూడాలి.

అశ్వనిదత్ , దిల్ రాజు , పి.వి.పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 4 న సినిమా థియేటర్స్ లోకి రానుంది.