బాలయ్య సినిమాలో మూడోసారి...

Friday,July 26,2019 - 10:02 by Z_CLU

బాలయ్య కొత్త సినిమాలో హీరోయిన్ అనగానే డెఫ్ఫినెట్ గా ఈ స్పేస్ లోకి వచ్చేది టాప్ హీరోయినే అనుకున్నారంతా. అందునా శ్రియ, నయనతార పేర్లయితే ఇంకా గట్టిగా వినిపించాయి. కానీ స్పెక్యులేషన్స్ కి రివర్స్ గా సోనాల్ చౌహాన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.

అయితే బాలయ్య సినిమాలో సోనాల్ చౌహాన్ నటించడం ఇదే ఫస్ట్ టైమ్ ఏం కాదు. గతంలోనూ లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో బాలయ్య సరసన నటించింది. అయితే ముచ్చటగా మూడోసారి కూడా నటసింహం తో జోడీ కట్టనుంది.

ఈ జెనెరేషన్ హీరోయిన్స్ లో బాలయ్య రిపీట్ చేసిన హీరోయిన్స్ ఎవరైనా ఉంటే అది నయనతార, శ్రియ లే. ఇప్పుడు ఆ వరసలో సోనాల్ చౌహాన్ చేరింది. అందునా దర్శకుడు K.S. రవికుమార్ సోనాల్ కోసం ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ కూడా రాసుకున్నాడట.

బాలయ్య ఇన్ని అవకాశాలు ఇస్తున్నా తెలుగు టాప్ హీరోయిన్ ప్లేస్ ని అందుకోలేకపోయిన సోనాల్, ఈ సినిమాతో  మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుందీ బాలీవుడ్ బ్యూటీ.