SBSB Teaser శ్లోకాలతో విరాట్!

Monday,December 14,2020 - 01:56 by Z_CLU

సుప్రీం హీరో Sai Dharam Tej హీరోగా SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘Solo Barthuke So Better‘ రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 25 న క్రిస్మస్ కానుకగా జీ స్టూడియోస్ ద్వారా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి థీం టీజర్ తో ఓ ప్రోమో వదిలారు మేకర్స్.

విరాట్ శ్లోకాస్ అంటూ సింగిల్ లైఫ్ గురించి విరాట్ ఇచ్చే ఉపన్యాసంతో విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

మీకింకా నేనెందుకు ఈ రిలేషన్ షిప్స్ వద్దని చెప్తున్నానొ మీకర్థమవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో 108 శ్లోకాల ఈ పుస్తకం రాసాను అంటూ తేజ్ చెప్పే డైలాగ్ తో పాటు టీజర్ లో చెప్పిన రెండు శ్లోకాలు హైలైట్ గా నిలిచాయి. మరిన్ని శ్లోకాల కోసం స్టే ట్యూన్ అంటూ ప్రోమో ని ఎండ్ చేసారు. ఈ టీజర్ తో సినిమాలో బోలెడంత ఫన్ ఉంటుందని ఆడియన్స్ కి హింట్ ఇచ్చేసారు మేకర్స్.