Solo Brathuke So Better - ట్రయిలర్ రేపే

Friday,December 18,2020 - 07:16 by Z_CLU

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. రేపు ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ అవ్వబోతోంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయబోతోంది.

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న బడా మూవీ ఇదే కావడంతో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సాంగ్స్ హిట్టవ్వడంతో ఈ ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగాయి. అంచనాలన్నింటినీ అందుకుంటామనే ధీమాతో ఉంది యూనిట్.

solo_brathuke_so_better_sai_Dharam_tej 1

సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు. జీ స్టుడియోస్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది సోలో బ్రతుకే సో బెటర్.