Solo Brathuke So Better - ట్రయిలర్ రివ్యూ

Saturday,December 19,2020 - 11:52 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ, లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోకొస్తున్న బిగ్ మూవీ Solo Brathuke So Better. కొద్దిసేపటి కిందట రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రయిలర్ తో ఈ సినిమాకు అఫీషియల్ కౌంట్ డౌన్ మొదలైంది. ట్రయిలర్ చూస్తే సినిమా మొత్తం ఓ బ్రహ్మచారి బయోపిక్ లా అనిపిస్తుంది.

 

ట్రయిలర్ కంటెంట్ చూస్తే.. ఓ బ్రహ్మచారి. పెళ్లంటే అస్సలు గిట్టని కుర్రాడు. పెళ్లి చేసుకోవడం వల్ల స్వేచ్ఛ అనే ప్రాధమిక హక్కును కూడా కోల్పోతున్నామంటూ చాగంటి రేంజ్ లో సూక్తులు చెప్పే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది.

మరి అందరికీ పెళ్లి వద్దని చెప్పే హీరో, ఆ అమ్మాయికి పడిపోయాడా? ఆమెను పెళ్లి చేసుకుంటాడా? అమ్మాయి రాకతో ఈ బ్యాచిలర్ జీవితంలో ఎదురైన కష్టాలేంటి అనేది ఈ సోలో బ్రతుకే సో బెటర్ మూవీ.

ట్రయిలర్ లో సాయిధరమ్ తేజ్ (SaiDharamTej) ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నాడు. హీరోయిన్ నభా (Nabha Natesh) కూడా గ్లామరస్ గా ఉంది. రాజేంద్రప్రసాద్, నరేష్, రావు రమేష్, సత్య.. ఇలా మంచి క్రేజీ క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. దీనికితోడు తమన్ మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. ఇలా ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి.

టైటిల్ కు తగ్గట్టు.. లాక్ డౌన్ తర్వాత ఎలాంటి పోటీ లేకుండా సోలోగా వస్తున్న బిగ్ మూవీ ఇదే. ఈ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్ ఇదే. యూత్ ఫుల్ కంటెంట్ తో క్రిస్మస్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమాపై ట్రయిలర్ తో భారీ అంచనాలు పెరిగాయి. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.