Solo Brathuke So Better - క్రిస్మస్ స్పెషల్
Saturday,November 28,2020 - 05:28 by Z_CLU
Solo Brathuke So Better to release on Dec 25
సాయితేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. జీ స్టుడియోస్ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేస్తోంది.

ఈ సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ సిస్టమ్ గాడిన పడుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
Sai Dharam Tej, Nabha హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. SVCC బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న బిగ్ మూవీ ఇదే.
సినిమా టీజర్ కు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కూడా సూపర్ హిట్టయ్యాయి. మిగతా పాటల్ని కూడా త్వరలోనే రిలీజ్ చేసి, ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.