Solo Brathuke - టైటిల్ సాంగ్ అదుర్స్

Friday,December 11,2020 - 01:36 by Z_CLU

ఫ్లాగ్ షిప్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తమన్ కు తిరుగులేదనే విషయం తెలిసిందే. లెక్కలేనన్ని సినిమాలకు తన ఐకానిక్ కంపోజిషన్స్ తో హిట్ టాక్ తెచ్చాడు. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ మూవీకి కూడా తమన్ తమ మార్క్ యాడ్ చేశాడు.

సాయి తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా నుంచి కొద్దిసేపటి కిందట టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. అందరి అంచనాల్ని అందుకుంటూ, ఫుల్ జోష్ నింపేలా ఉంది ఈ సాంగ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ రాయగా.. విశాల్ ఆలపించాడు.

సినిమా థీమ్ ఏంటి.. హీరో క్యారెక్టరైజేషన్ ఏంటనే విషయాన్ని ఈ ఒక్క సాంగ్ లో క్లియర్ గా చెప్పేశారు. లిరికల్ వీడియోలో భాగంగా రిలీజ్ చేసిన మేకింగ్ షాట్స్ మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్
చేస్తున్నాయి.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది సోలో బ్రతుకే సో బెటర్. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సుబ్బు డైరక్ట్ చేశాడు. జీ స్టుడియోస్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.