#SoloBrathukeSoBetter - మళ్లీ సెట్స్ పైకి

Monday,August 31,2020 - 07:25 by Z_CLU

సాయితేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better) సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకొచ్చింది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించినట్టు మేకర్స్ ఎనౌన్స్ చేశారు.

కరోనా ప్రికాషన్స్ అన్నీ తీసుకొని షూటింగ్ మొదలుపెట్టారు. హీరో Sai Dharam Tej తో పాటు హీరోయిన్ Nabha Natesh సెట్స్ పైకి వచ్చింది. అందరూ ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు వేసుకున్నారు. యూనిట్ లో ప్రతి ఒక్కర్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే సెట్స్ పైకి అనుమతించారు. మేకప్ మెన్ అయితే ఏకంగా PPE కిట్స్ వేసుకున్నారు.

10 రోజుల పాటు జరగనున్న ఈ ఫైనల్ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సుబ్బు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను BVSN Prasad నిర్మిస్తున్నారు.

తమన్ (Thaman) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 2 పాటలూ సూపర్ హిట్టవ్వడంతో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.