SBSB - జోరుగా అడ్వాన్స్ బుకింగ్

Monday,December 21,2020 - 10:10 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న క్రేజీ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better). ఆ ఇమేజ్ కు తగ్గట్టే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. 2 రోజుల కిందటే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వగా.. చాలా మంది టిక్కెట్లు కొనుక్కున్నారు.

ఆన్ లైన్ టికెట్ సైట్స్ లో సింగిల్ స్క్రీన్స్ కంటే ఎక్కువగా మల్టీప్లెక్సులు కనిపిస్తుంటాయి. అలా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమాకు మల్టీప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ బాగా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది.

లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇదొక్కటే. అందుకే అడ్వాన్స్ బుకింగ్ జోరుగా సాగుతోంది. ఏపీ, నైజాంతో పాటు.. కర్నాటక, చెన్నైలో కూడా ఈ సినిమాకు ముందే టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.

సాయిధరమ్ తేజ్నభా నటేష్ (Nabha Natesh) జంటగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దీనికితోడు తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రయిలర్ ఇనిస్టెంట్ హిట్టవ్వడంతో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి.

క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది సోలో బ్రతుకే సో బెటర్. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

Also Check – సోలోగా టైటిల్ ట్రాక్