Solo Brathuke So Better - 2 రోజుల వసూళ్లు

Sunday,December 27,2020 - 12:34 by Z_CLU

సూపర్ హిట్టయిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ రెండో రోజు కూడా తన ప్రభంజనం కొనసాగించింది. 50శాతం ఆక్యుపెన్సీతో కలెక్షన్ సాధించడం సాధ్యమా అనే డౌట్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.

2 రోజుల్లో ఈ సినిమాకు అక్షరాలా 7 కోట్ల 99 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇదే ట్రెండ్ నడిస్తే, రేపటికి చాలా ఏరియాల్లో మూవీ బ్రేక్ ఈవెన్ రేంజ్ కు చేరుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు మొదటి రోజు తెలుగు స్టేట్స్ లో 4 కోట్ల 70 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. రెండో రోజు ఈ సినిమాకు 3 కోట్ల 29 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. అలా 2 రోజుల్లో 7 కోట్ల 99 లక్షల గ్రాస్ సాధించింది ఈ సినిమా.

50 శాతం ఆక్యుపెన్సీతో 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు దగ్గరవ్వడం నిజంగా గ్రేట్ అంటోంది ట్రేడ్. మంగళవారం నుంచి ఈ సినిమాకు లాభాలు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఏపీ, నైజాం 2వ రోజు గ్రాస్
నైజాం – 1.19 కోట్లు
సీడెడ్ – 0.59 కోట్లు
గుంటూరు – 0.26 కోట్లు
నెల్లూరు – 0.13 కోట్లు
కృష్ణా – 0.18 కోట్లు
వెస్ట్ – 0.15 కోట్లు
ఈస్ట్ – 0.24 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.55 కోట్లు