సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Monday,February 20,2017 - 03:15 by Z_CLU

కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నాగ చైతన్య సినిమా, నాగార్జున కరియర్ లో నిన్నే పెళ్ళాడతా ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో అదే రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫిక్సయి ఉన్నారు ఫ్యాన్స్. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చైతు ఎలా కనిపించనున్నాడో అన్న క్యూరాసిటీ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది.

అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటిస్తున్నాడట చైతు, క్యారెక్టర్ సాఫ్ట్ అండ్ ఫార్మల్ లుక్స్ లో ఉన్నా, సిచ్యువేషన్ ని బట్టి హీరో రఫ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తాడు అని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్.

సోగ్గాడే చిన్ని నాయనా తరవాత నాగ చైతన్య తో మరో కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ కి మెగా ఫోన్ పట్టుకున్న కళ్యాణ్ కృష్ణ, నాగచైతన్య ని సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ తరవాత మరో ఆంగిల్ లో సిల్వర్ స్క్రీన్ పై రొమాంటిక్ మ్యాజిక్ స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతున్న ఈ సినిమా, ఫ్యాన్స్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ నే క్రియేట్ చేస్తుంది.