జై లవకుశ సోషల్ మీడియా రికార్డులు

Friday,July 07,2017 - 12:19 by Z_CLU

కొన్ని గంటల కిందట విడుదలైన జై లవకుశ టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన 4 గంటలకే రికార్డు వ్యూస్ సాధించిన ఈ టీజర్.. లైక్స్ విషయంలో కూడా అదే జోరు చూపించింది. కేవలం తెలుగు సినిమాతో పోటీపడ్డం కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పోటీపడి మరీ ట్రెండ్ సృష్టించింది జై లవకుశ టీజర్.

అజిత్ నటించిన వివేగమ్ టీజర్ కు లక్ష లైకులు రావడానికి  48 నిమిషాలు పడింది. రజనీ నటించిన కబాలి 90 నిమిషాల్లో, విజయ్ భైరవ మూవీ టీజర్ 125 నిమిషాల్లో, సల్మాన్ ఖాన్ ‘ట్యూబ్ లైట్’ 168  నిమిషాల్లో లక్ష లైకులు సాధించాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి జై లవకుశ టీజర్ కూడా చేరింది. 103 నిమిషాల్లో లక్ష లైక్స్ వచ్చాయి ఈ టీజర్ కు. అలా అతి తక్కువ టైమ్ లో లక్ష లైకులు సాధించిన మూడో సినిమాగా అవతరించింది జై లవకుశ మూవీ.

NTR కరియర్ లోనే డిఫెరెంట్ మూవీగా వస్తున్న ‘జై లవకుశ’ టీజర్ అటు క్లాస్, మాస్ తేడా లేకుండా అందరినీ ఇంప్రెస్ చేసింది. ఫస్ట్ టైమ్ NTR ని నెగెటివ్ షేడ్స్ లో ప్రజెంట్ చేసిన ఈ టీజర్, సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 21న జై లవకుశ థియేటర్లలోకి వస్తోంది.