సీక్రెట్ గా పెళ్ళి చేసుకున్న నేహా ధూపియా

Thursday,May 10,2018 - 06:48 by Z_CLU

బాలీవుడ్ లో పెళ్ళి సీజన్ నడుస్తుంది. నిన్న సోనమ్ కపూర్ పెళ్ళి వేడుక ఘనంగా జరిగితే, ఈ రోజు అంతే సీక్రెట్ గా జరిగిన నేహా ధూపియ పెళ్ళి సోహల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ లా మారింది. తన కాలేజ్ ఫ్రెండ్ అంగద్ బేడీని పెళ్ళి చేసుకుంది నేహా ధూపియా. ఈ విషయాన్ని కరణ్ జోహర్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడంతో జస్ట్ నేహా ధూపియా ఫ్యాన్సే కాదు, బాలీవుడ్ సెలెబ్రిటీస్ కూడా ఉలిక్కిపడ్డారు.

పంజాబీ సంప్రదాయంలో న్యూ ఢిల్లీ లోని గురుద్వారా లో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్ళి ఫోటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

రీసెంట్ గా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘పింక్’ సినిమాతో పాటు సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు అంగద్ బేడీ.  రీసెంట్ గా రిలీజైన ‘తుమ్హారీ సులు’ సినిమాలో స్పెషల్ రోల్ లో ఎట్రాక్ట్ చేసిన నేహా ధూపియా మ్యారేజ్ సీక్రెట్ గా చేసుకున్నా, ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.