Sitara Ghattamaneni - మహేష్ కూతురు ఎంట్రీ ఫిక్స్?
Friday,October 08,2021 - 12:41 by Z_CLU
Sitara Ghattamaneni to debut with Vijay, Vamsi Paidipally Movie?
సూపర్ స్టార్ మహేష్ కూతురు ఘట్టమనేని సితార త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే తన యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని వీడియోస్ చేస్తూ ఎట్రాక్ట్ చేస్తున్న సితార సినిమా కెమెరా ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ్ లో ఓ బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో ఒక చైల్డ్ రోల్ ఉందట. ఆ రోల్ ని సితార తో చేయించాలని భావించి ఇటివలే మహేష్, నమ్రత లను సంప్రదించారట వంశీ పైడిపల్లి. ఇక వంశీ చెప్పిన రోల్ మహేష్ దంపతులకు బాగా నచ్చిందని, సితార ఎంట్రీకి వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని టాక్ వినబడుతుంది.
మహేష్ తనయుడు గౌతమ్ గతంలో ‘ వన్ నేనొక్కడినే’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఆ సినిమాలో మహేష్ చైల్డ్ ఎపిసోడ్ సీక్వెన్స్ రాసుకొని గౌతమ్ తో ఆ ఎపిసోడ్ తీశాడు. సో ఇప్పుడు తండ్రి , అన్నయ్య రూట్లోనే సితార కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక తాజాగా అల్లు అర్జున్ తనయ ఆర్హ కూడా సమంత తో గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్హ లాగే సితార కూడా విజయ్ సినిమాతో బాల నటిగా పరిచయం అవ్వనుందన్నమాట. త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేసి సితారకి వెల్కం చెప్పనున్నారు మేకర్స్.
ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics