నాన్నకి స్పెషల్ థాంక్స్ -సితార

Saturday,September 03,2022 - 11:10 by Z_CLU

ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీసన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్ ను మునుపెన్నడూలేని విధంగా ప్రారంభించనుంది. సూపర్స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్ ను ‘ఫ్లాగ్ ఆఫ్’ చేయబోతుండగా, తన కూతురు సితారతో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షో లో కనిపించనున్నారు. కంటెస్టెంట్స్ యొక్క మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్ మరియు జడ్జెస్ తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.

సితార షో లో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ..”నేను ఒక టీవీ షో స్టేజ్ పై రావడం ఇదే మొదటిసారైనప్పటికీ నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా గడిచిపోయింది. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం మరియు కంటెస్టెంట్స్ యొక్క పెర్ఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి. నా మొదటి టీవీ షో ఎక్స్పీరియన్స్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్,” అని చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించబోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనుంది. అంతేకాకుండా, తన ముద్దు ముద్దు మాటలతో మరియు చక్కని డాన్స్ ప్రదర్శనతో సితార ఈ వారం ‘జీ తెలుగు’ ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

ఈ ఆదివారం (సెప్టెంబర్ 4) మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమవుతున్న వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ‘మన ఊరి రంగస్థలం’ మరియు రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో…

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics