మరోసారి సింగం కాంబినేషన్

Tuesday,April 25,2017 - 06:00 by Z_CLU

డైరెక్టర్ హరి, సూర్య మరోసారి సెట్స్ పైకి రానున్నారు. సింగం సిరీస్ తో సిల్వర్ స్క్రీన్ పై వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన ఈ కాంబో మరో బ్లాక్ బస్టర్ కోసం ఆల్ రెడీ గ్రౌండ్ వర్క్ బిగిన్ చేసేసింది. సింగం కాంబో అనగానే వీరిద్దరూ సింగం 4 కానీ ప్లాన్ చేస్తున్నారా…? అని గెస్ చేసేవారికి చిన్న క్లారిటీ ఏంటంటే సింగం ఫ్రాంచైజీకి ఆల్ రెడీ అఫీషియల్ గా ప్యాకప్ చెప్పెసిందీ సింగం టీమ్. కాబట్టి మళ్ళీ సింగం జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు.

ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ సినిమాతో సెట్స్ పై ఉన్న సూర్య,  ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఇంతకు ముందే అనౌన్స్ చేసినట్టు సెల్వ రాఘవన్ తో సినిమా చేస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాతే మళ్ళీ హరి డైరెక్టోరియల్ కి రెడీ అవుతాడు సూర్య.

సింగం సిరీస్ తో ఈ కాంబోకి హై ఎండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. అందుకే సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా బోలెడంత టైమ్ ఉన్నా అప్పుడే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను చిన్న సైజు వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే గ్రౌండ్ వర్క్ బిగిన్ అయిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి సంబంధించి తక్కిన డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.