వెనక్కి తగ్గిన సింహం

Friday,December 02,2016 - 05:50 by Z_CLU

డిఫరెంట్ సినిమాలతో హీరోగా దూసుకెళ్తున్న సూర్య వెనక్కి తగ్గాడు. కారణం అదేనట. ఇదేంటి? సూర్య వెనక్కి తగ్గాడాా ఎందుకు.. ఏమిటా కారణం అనుకుంటున్నారా?

సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘సింగం-3 ‘ డిసెంబర్ 16 న వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ డేట్ తో ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలెట్టిన సూర్య ఇప్పుడు వాయిదా బాటపట్టాడు.  ఈ నెల 16 నుండి 23 కి సింగం-3 సినిమాను పోస్ట్ పోన్ చేశాడు. తాజాగా విడుదల చేసిన టీజర్ లో డిసెంబర్ 23ను  రిలీజ్ డేట్ గాా ప్రకటించారు.

     ఉన్నట్టుండి సడెన్ గా సూర్య ఇలా వెనక్కి తగ్గడానికి గట్టి కారణమే ఉందట. రామ్ చరణ్ హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన ‘ధృవ’ ఈ నెల 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి ఓ వారం గ్యాప్ లోనే సూర్య సింగం౩ వస్తుండడం తో… చెర్రీ కోసం సూర్య తన సినిమాను వాయిదా వేసుకున్నట్టు టాక్.  సూర్య కి మెగా ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ సూర్య కి మంచి అనుబంధం ఉంది. ‘గజినీ’ సినిమాను తెలుగులో రిలీజ్ చేసినప్పటి నుంచి అల్లు అరవింద్ అంటే సూర్య కి అమితమైన గౌరవం. ఆ అభిమానంతోనే తన సినిమాను వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నట్టు చెబుతున్నారు.