ఇదంతా ‘సాహో’ వల్లే...

Tuesday,July 09,2019 - 10:02 by Z_CLU

సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ‘సైకో సయ్యా’ సాంగ్. అయితే ఈ సాంగ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చేసింది సింగర్ ధ్వని భానుశాలి. ఇప్పటికే తన యూ ట్యూబ్ చానల్ తో ఇంస్త్రా గ్రామ్ లో ఉన్న క్రేజ్ తో, ఇప్పుడిప్పుడే బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటున్న ధ్వని రేజ్ ఈ సాంగ్ తో ఒక్కసారిగా పెరిగిపోయింది.

‘సైకో సయ్యా’ ని సాంగ్ ని 4 భాషల్లో నలుగురు మేల్ సింగర్స్ పాడారు.. కానీ ఫీమేల్ వర్షన్ వరకు వచ్చేసరికి ధ్వని ఒక్కతే. అందునా ఇతర భాషల్లో ధ్వని కరియర్ లోనే ఇదే ఫస్ట్ టైమ్. ఏకంగా ప్రభాస్ సినిమాతో ఇతర భాష సినిమాలకు ఇంట్రడ్యూస్ అవ్వడం ధ్వనికి కలిసొస్తుంది.

ధ్వని ఈ సినిమాలో ఇంకెన్ని సాంగ్స్ లో పాడింది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. ఈ సాంగ్ క్రియేట్ చేస్తున్న వైబ్స్ చూస్తుంటే… ఈ సింగర్ సౌత్ లో కూడా బిజీ అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

బాలీవుడ్ తరహాలో ముందు ప్రోమో సాంగ్ తో బిగిన్ అయి ఆ తరవాత కంప్లీట్ సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. మిగతా సాంగ్స్ విషయాల్లో కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతారా..? లేకపోతే వరసగా సింగిల్స్ ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తారా..? అనేది చూడాలి. ‘సైకో సయ్యా’ మాత్రం ఈ సినిమా కంప్లీట్ ఆల్బమ్ పై అంచనాలను భారీగా పెంచేసింది.