ఫిబ్రవరి 9న సింగం-3 రిలీజ్

Wednesday,January 25,2017 - 06:28 by Z_CLU

వరుసగా వాయిదాపడుతూ వస్తున్న సింగం-3 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వాస్తవానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపే సింగం-3 సినిమా థియేటర్లలో సందడి చేయాలి. కానీ తమిళనాట సినిమా విడుదల చేయడానికి సరైన పరిస్థితులు లేకపోవడంతో సింగం-3 మరోసారి వాయిదాపడింది. ఈసారి కచ్చితంగా ఫిబ్రవరి 9కి విడుదల చేసి తీరతామంటున్నాడు హీరో సూర్య.

తెలుగులో ఈ సినిమా యముడు-3 పేరుతో విడుదలకాానుంది. హరి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అనుష్క, శృతిహాసన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రయిలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో… యముడు-3పై అంచనాలు పెరిగాయి. తెలుగులో మల్కాపురం శివకుమార్.. యముడు-3 సినిమాను సమర్పిస్తున్నాడు.

singam-3-zee-cinemalu-222