ఆ సినిమాతో నాకు సంబంధం లేదు

Wednesday,June 03,2020 - 05:57 by Z_CLU

హీరోయిన్లు, పుకార్లు నిత్యం ఓ ప్యాకేజీలా వస్తుంటాయి. ఏ హీరోయిన్ పై ఎప్పుడు ఏ టైపు రూమర్ క్రియేట్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ పై కూడా అలాంటి గాసిప్ ఒకటి బయల్దేరింది. వెంటనే అలెర్ట్ అయిన సిమ్రాన్.. వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. చంద్రముఖి సీక్వెల్ లో జ్యోతిక బదులు సిమ్రాన్ ను తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన జ్యోతికను తీసేసి సిమ్రాన్ ను పెట్టడం ఏంటంటూ డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. అయితే చంద్రముఖి-2లో తను నటించడం లేదని స్పష్టంచేసింది సిమ్రాన్.

“చంద్రముఖి 2లో నేను నటిస్తున్నాననేది నిజం కాదు. నా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసినందుకు క్షమించండి. ఆ ప్రాజెక్టులో నటించమని నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు. ఇకపై ఇలాంటివి రాసేముందు నన్ను అడిగి క్లారిటీ తీసుకుంటే మంచిది.”