సిల్వర్ స్క్రీన్ పై క్రికెటర్స్

Sunday,January 20,2019 - 11:00 by Z_CLU

2019 లో టాలీవుడ్ యంగ్ హీరోలు క్రికెటర్స్ గా అవతారమెత్తి థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ లిస్టు లో ముందున్నాడు నాని. ‘జెర్సి’ సినిమాలో క్రికెటర్ అర్జున్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా క్రికెట్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు నేచురల్ స్టార్.

ఇక మజిలీ సినిమాలో నాగ చైతన్య కూడా క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఇటివలే రిలీజయిన పోస్టర్ లో క్రికెటర్ గా కనిపించాడు చైతు. నాని , చైతూ రూట్లోనే సందీప్ కిషన్ కూడా బ్యాట్ పట్టి మ్యాచ్ ఆడబోతున్నాడు. ‘సుబ్రమణ్యపురం’ ఫేం సంతోష్ జగర్లపూడి డైరెక్షన్ లో క్రికెట్ బేస్డ్ మూవీ చేయబోతున్నాడు సందీప్.

ఇక యంగ్ హీరోలతో పాటు రష్మిక కూడా ‘డియర్ కామ్రేడ్’ లో క్రికెటర్ గా నటిస్తోంది. ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ తో ఆడియన్స్ ని కొత్తగా ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ క్రికెటర్స్ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్షన్స్ రాబడతారో చూడాలి.