Siddhu Jonnalagadda - 'టిల్లు స్క్వేర్' వస్తోంది

Monday,October 24,2022 - 04:05 by Z_CLU

Siddhu Jonnalagadda’s DJ Tillu Sequel titled as Tillu Square

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. దీని పేరు ‘టిల్లు స్క్వేర్’.

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

‘టిల్లు స్క్వేర్’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. బాక్సాఫీస్ దగ్గర ‘డీజే టిల్లు’ సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని విడుదల చేసింది యూనిట్.

‘డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.