#MAHASAMUDRAM - ఎవర్ గ్రీన్ సిద్దార్థ్

Saturday,April 17,2021 - 05:11 by Z_CLU

శర్వానంద్ , సిద్దార్థ్ లతో ‘ఆర్ ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’ సినిమా నుండి లేటెస్ట్ గా సిద్దార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈరోజు సిద్దు పుట్టిన రోజు కావడంతో పోస్టర్ ద్వారా విషెస్ చెప్పారు మేకర్స్. పోస్టర్ లో క్యూ లో నిలుచున్న సిద్దు స్టిల్ చూస్తూ సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హీరో అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. సినిమాలో శర్వానంద్ తో పాటు ఓ హీరోగా నటిస్తున్నాడు సిద్దు. కాకపోతే ఈ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అందుకే ఈ పాత్రకు సిద్దుని ఎంచుకున్నాడట దర్శకుడు అజయ్. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాను ఓకె చేసి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇప్పటికే సిద్దు , శర్వానంద్ మీద చాలా వరకు సన్నివేశాలు పూర్తి చేశారు.

Siddharth Mahasamudram 2

ఒక టైంలో టాలీవుడ్ ఓ ఊపు ఊపేశాడు సిద్దు. వరుస పెట్టి సూపర్ హిట్లు కొడుతూ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. కానీ ఆ తర్వాత రాంగ్ చాయిస్ సినిమాలు చేసి అపజయాలు అందుకున్నాడు. ఇక వరుస ఫ్లాప్స్ అందుకోవడంతో టాలీవుడ్ లో బ్రేక్ తీసుకొని కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యాడు. తమిళ్ లో మంచి కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ నటుడిగా మరిన్ని ప్రయోగాలు చేస్తున్న సిద్దు మళ్ళీ ఇన్నేళ్ళకి మహా సముద్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించి ఇక్కడ బిజీ అవ్వాలని చూస్తున్నాడు.

ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయెల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా సాంగ్స్ లిరికల్ వీడియో ద్వారా త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ తీస్తున్న రెండో సినిమా కావడంతో ఈ కాంబో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్ట్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics